Connect with us

మొబైల్ మరియు గాడ్జెట్లు

ఇండియాలో HTC Wildfire X లాంచ్ అయ్యింది: Vodafone వినియోగదారులకు పండగే

భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుండి సుదీర్ఘకాలం సెలవు తరువాత, తైవానీస్ టెక్ సంస్థ HTC Wildfire X అనే కొత్త మిడ్-రేంజ్ హ్యాండ్‌సెట్‌తో తిరిగి దేశంలోకి ప్రవేశించింది.

HTC Wildfire X

HTC Wildfire X స్పెసిఫికేషన్స్

HTC Wildfire X లో 6.22-అంగుళాల హెచ్‌డి + (1520 × 720 పిక్సెల్స్) డిస్‌ప్లే టియర్‌డ్రాప్ నాచ్ తో వస్తుంది. ఇది MediaTek Helio P22 SoC మరియు 4GB RAM + 128GB స్టోరీస్ తో వస్తుంది. మైక్రో SD కార్డుతో 256GB వరకు పెంచుకోవచ్చు. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్, 10W ఛార్జింగ్ మద్దతు మరియు 3,300mAh బ్యాటరీ ఉన్నాయి.

వెనుక వైపున ఉన్న ట్రిపుల్-కెమెరా సెటప్లో, 1.25um పిక్సెల్ పరిమాణంతో 12MP ప్రాధమిక కెమెరా, 2x ఆప్టికల్ జూమ్ సమానమైన టెలిఫోటో లెన్స్‌తో జతచేయబడిన 8MP సెకండరీ సెన్సార్ మరియు పోర్ట్రెయిట్ మోడ్ షాట్‌ల కోసం 5MP డెప్త్ సెన్సార్.  ఈ స్మార్ట్ ఫోన్ 86-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (FoV) తో 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.

డ్యూయల్ 4G VoLTE, డ్యూయల్-బ్యాండ్ వైఫై 802.11ac, బ్లూటూత్ 4.1, జిపిఎస్ + గ్లోనాస్, USB Type C మరియు 3.5MM ఆడియో సాకెట్. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ Pie(9.0) తో వస్తుంది.

HTC Wildfire X ధర, లభ్యత మరియు ఆఫర్‌లు

HTC Wildfire X నీలమణి బ్లూ కలర్లో మాత్రమే లభిస్తుంది , 3GB + 64GB మోడల్‌కు రూ.9,999 ఉండగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ.12.999. ఇది ఆగస్టు 22 నుండి Flipkart లో లభిస్తుంది. లాంచ్ ఆఫర్లలో 18 నెలలకు రోజు 500MB డేటా మరియు వోడాఫోన్ నుండి రూ.3,750 విలువైన క్యాష్‌బ్యాక్ 50 కూపన్ల రూపంలో రూ.75 చొప్పున ఇవ్వబడుతుంది.

Hey namastey ! I'm Arun Kumar I love technology and gadgets

Advertisement
0

Popular Now