Connect with us

మొబైల్ మరియు గాడ్జెట్లు

రెడ్‌మి నోట్ 8 చైనా లో లాంచ్ అయ్యింది: ధర, లభ్యత మరియు స్పెక్స్

రెడ్‌మి నోట్ 8 సిరీస్ శక్తివంతమైన కొత్త చిప్‌సెట్, వాటర్‌డ్రాప్ నోచెస్, క్వాడ్ కెమెరాలు మరియు మరెన్నో కొత్త ఫీచర్లతో ఈరోజు చైనాలో లాంచ్ అయ్యింది.

Redmi Note 8

రెడ్‌మి నోట్ 8: స్పెక్స్

రెడ్మి నోట్ 8 డిజైన్ పరంగా రెడ్మి నోట్ 8 ప్రో తో సమానంగా ఉంటుంది, క్వాడ్-కెమెరా మాడ్యూల్ అంచుకు దగ్గర చిన్న తేడా తప్ప. ఈ స్మార్ట్ ఫోన్ 6.3-అంగుళాల ఎల్‌టిపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో వస్తుంది, 90% స్క్రీన్-టు-బాడీ రేషియో తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది, ఇది 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. కొన్ని రోజుల క్రితం భారతదేశంలో లాంచ్ అయిన Mi A3 లో ఉన్న అదే చిప్‌సెట్.

రెడ్‌మి నోట్ 8 క్వాడ్-కెమెరా సెటప్‌ ఉంది, 48MP (f / 1.79) ప్రాధమిక సెన్సార్, 120 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్ వ్యూతో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌, 2MP మాక్రో లెన్స్ (2cm ఫోకల్ లెంగ్త్‌తో) మరియు 2MP లోతు సెన్సార్ ప్రాధమిక లెన్స్ మినహా మిగతా అన్ని లెన్సులు రెడ్‌మి నోట్ 8 ప్రో వేరియంట్‌తో సమానం.  వాటర్‌డ్రాప్ నాచ్ లో 13MP సెల్ఫీ కెమెరా ఉంది.

రెడ్‌మి నోట్ 8 ప్రో ఉన్న అదే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ కూడా ఉంది. ఫోన్ తో పాటు మీకు ఫాస్ట్ ఛార్జర్‌ లభిస్తుంది.

ధర మరియు లభ్యత

Redmi Note 8 price

రెడ్‌మి నోట్ 8 మెటోరైట్ బ్లాక్, బ్లూ-పర్పుల్ గ్రేడియంట్ మరియు వైట్ గ్రేడియంట్ 3 వైబ్రంట్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ 4GB + 64GB 999 యువాన్ (సుమారు రూ 10,000) , 6GB + 64GB 1,199 యువాన్ (రూ.12,000) మరియు 6GB + 128GB 1,399 యువాన్ (రూ.14,000).

రెడ్‌మి నోట్ 8 లైనప్‌ను భారత్ లో ఎప్పుడు లాంచ్ చేస్తారు అనే విషయాన్ని వెల్లడించలేదు కానీ త్వరలోనే ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంది.

Hey namastey ! I'm Arun Kumar I love technology and gadgets

Advertisement
0

Popular Now