Connect with us

టెక్నాలజీ వార్తలు

Vivo తన Vivo V17 ను ఇండియాలో విడుదల చేసింది

వివో U మరియు Z సిరీస్‌లతో భారత బడ్జెట్ విభాగంలో కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తుంది. ఇప్పుడు వివో V17 తో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో మార్కెట్ పెంచుకోవాలని చూస్తోంది. ఈ రోజు న్యూ ఢిల్లీలో జరిగిన లాంచ్ ఈవెంట్లో వివో V17 ను విడుదల చేసింది.

Vivo V17

వివో V17: స్పెక్స్ మరియు ఫీచర్స్

వివో V17 లో పంచ్-హోల్ డిజైన్‌తో 6.44-అంగుళాల Full-HD+ E3 సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే తో వస్తుంది. ఇది AMOLED ప్యానెల్ కనుక, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.

వివో V17 స్నాప్ డ్రాగన్ 675 మరియు ఆండ్రాయిడ్ 9 పై-ఆధారిత ఫన్‌టచోస్ 9.2 తో వస్తుంది. ఆండ్రాయిడ్ 10 అధికారికమైన ఫన్‌టచోస్ 4 నెలల తర్వాత వస్తుంది.

Vivo V17

వివో V17 లో క్వాడ్-కెమెరా సెటప్, 48MP (f/1.8) ప్రాధమిక లెన్స్, 8MP (f/2.2) అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్తో 120-డిగ్రీల ఫీల్డ్-వ్యూ, 2MP (f/2.4) డెప్త్ సెన్సార్, మరియు 2MP (f/2.4) మాక్రో లెన్స్ మరియు 48MP సెల్ఫీ కెమెరా.

ధర మరియు లభ్యత

వివో V17 8GB + 128GB కాన్ఫిగరేషన్‌లో వస్తుంది, దీని ధర రూ.22,990 రూపాయలు. ఇది ఇప్పుడు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది మరియు డిసెంబర్ 17 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో యొక్క ఆన్‌లైన్ స్టోర్ మరియు ప్రధాన ఆఫ్‌లైన్ రిటైలర్లలో విక్రయించబడుతుంది.

Hey namastey ! I'm Arun Kumar I love technology and gadgets

Advertisement
0

Popular Now